Take a fresh look at your lifestyle.

శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప ఆలయంలో ఘనంగా విష్ పూజ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శబరి నగర్ ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు, ఆలయ ప్రధానార్చకులు నరేంద్ర శర్మ జితేందర్ తివారి ఆధ్వర్యంలో బుధవారం విష్ పూజ అంగరంగ వైభవముగా నిర్వహించారు. విష్ పూజ అంటే కేరళ మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభం కేరళ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ కూడా అదేవిధంగా ఉత్సవమూర్తి అయ్యప్ప స్వామికి పండ్లు కూరగాయలు నవధాన్యాలు ఆకుకూరలు కిరాణా సరుకులు డ్రై ఫ్రూట్స్ తో స్వామివారి ముందు ఉంచి పూజలు చేసి ఆ పదార్థాలన్నీ కిచిడిగా చేసి వచ్చిన భక్తులందరికీ ప్రసాదముగా అందించారు. ( చిల్లర నాణాలు) అయ్యప్పస్వామి వారి ముందు ఉంచి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్, మంచుకొండ వినోద్, చామ రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీకటిమల్ల రాములు, సభ్యులు పోకల సోమన్న, రావుల శ్రీధర్, ఉపేష్ చారి, ఎకోజి, పాలకుర్త వేణు మాధవ్, మహిళా భక్తురాలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.