Take a fresh look at your lifestyle.

కూతుర్ని చంపిన తండ్రి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

భార్యపై కోపంతో కన్న కూతురుని చంపేశాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామానికి చెందిన ఎర్రబోయిన శ్రీరాములు పుట్టుకతో మూగ, చెవిటి వాడు. బుధవారం ఉదయం భార్య నాగమణితో ఇంట్లో గొడవపడి తన కూతురు ఎర్రబోయిన నిత్యశ్రీ (23 నెలలు) ని తన బండి పైన బలవంతంగా గ్రామ శివారులోకి తీసుకుని వెళ్ళి గొంతు నిలిమి చంపేశాడు. కొంత సమయం తర్వాత శ్రీరాములు తన అన్న రాజు కి వీడియో కాల్ చేసి నిత్యశ్రీ లేవట్లేదు అని చూపించాడు. వెంటనే అన్న రాజు నిత్యశ్రీ ని భువనగిరి జనరల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా మరణించినట్లు డాక్టర్ లు దృవీకరించారు. భార్యపై కోపంతోనే కూతురిని తానే హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్లో శ్రీరాములు లొంగిపోయాడు. బాలిక తాత మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ మిర్యాల అనిల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.