Take a fresh look at your lifestyle.

మాంసం వ్యర్థాల రవాణా వేలంకు మంచి స్పందన -మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్ రెడ్డి

 

ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజున కార్యాలయ ఆవరణలో చికెన్, మటన్, మరియు చేపలవ్యర్థాల సేకరణ, రవాణాకు సంబంధించి, స్లాటర్ హౌస్ లకు సంబంధించి బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో తాండూర్ కు చెందిన ఎండి హమీద్ గారు అత్యధికంగారూ. 20 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో ఎజాజ్, అబ్దుల్ రహీం లు పాల్గొన్నారు. ఇందులో అబ్దుల్ రహీం రూ 17 లక్షల7 వేలకు పాట పాడగా, ఎండీ. హమీద్ రూ. 20వేలకు హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు. అదేవిధంగా
స్లాటర్ హౌస్ బహిరంగ వేలంలో ఎండీ. మజీద్, ఖురేషులు పాల్గొన్నారు. ఇందులో ఎండి మజీద్ అత్యధికంగారూ. 64 వేలు పాట పాడి వేలాన్ని దక్కించుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరపాలని నిబంధనలు అతిక్రమిస్తే టెండర్లు రద్దు చేస్తామని వారు పేర్కొన్నారు.
31మార్చ్ 2027 వరకు ఈ టెండర్ ఉంటుందని, ఏడు పని దినాలలో టెండర్ల పాట పాడిన అమౌంటును మున్సిపాలిటీకి జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్,కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వివిధ పార్టీల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.