తాండూరు, ముద్ర ప్రతినిధి :
తాండూరు మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు
బుధవారం తెల్లవారు జామున కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా కాలనీలోని ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. ఇంట్లో ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. ఇళ్లలో ఉన్న వాహనాల పత్రాలను తాండూర్
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ లో పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోఎవరైనా అనుమానితులు నివాసం ఉంటున్నారా అని ఆరా తీశారు. అనంతరం పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టం జరిగిందన్నారు. ప్రజలందరు శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.
ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. మహిళల పట్ల సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. మరోవైపు సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పత్రాలను చూపించి వాటిని తీసుకెళ్లవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు పరమేశ్వర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది, వార్డు కౌన్సిలర్ జావిద్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.