గొల్లపల్లి,ముద్ర: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న పట్టిచుకొనే నాధుడు లేడా? వీధి దీపాలు వెలుగుతున్న అధికారులు.మాకు సంబంధంలేదు అన్నట్లు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో పర్యవేక్షణ కరువై వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నా వీధి దీపాలు.దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను.గ్రామ పంచాయితీ కార్యదర్శి,విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.గ్రామంలో కొన్ని చోట్ల మొదలే వెలుగకా పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మరి కొన్ని చోట్ల వీధి దీపాలు నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతుండంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృధా అవుతుందాని పలువురు పేర్కొన్నారు.దీని పై సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్నా విద్యుత్ సమస్యలు తొలగించి వీధిలైట్లకు ప్రత్యేక స్విచులు ఏర్పాటు చేయాలని గ్రామా ప్రజలు తదితరులు కోరుతున్నారు.
