Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

వికారాబాద్,ముద్ర ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం క‌లెక్ట‌రేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి ప్రజావాణి లో 126 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందరు సమయ పాలన పాటించాలని,తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయీ లో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.ప్రజావాణిలో 126 దరఖాస్తులు రాగా అందులో కలెక్టరేట్ సెక్షన్లలకు, రెవిన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి ఆర్ డి ఓ వా సుచంద్ర , వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.