Take a fresh look at your lifestyle.

జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను కలిసిన ఎమ్మెల్యే బండారి

  • మురుగు కాలువ సమస్యను పరిష్కరించాలని వినతి.

కుషాయిగూడ, ముద్ర విలేఖరి: చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, తదితర కాలనీలో నెలకొన్న భూగర్భ మరుగునీటి కాలువ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయా కాలనీ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను కలిశారు. సోమవారం జోనల్ కార్యాలయంలో జోనల్ కమీషనర్ను కలిసిన ఎమ్మెల్యే బండారి అనేక ఏళ్లుగా రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ, కృష్ణానగర్, ఎం ఆర్ ఆర్ కాలనీలు మురుగు కాలువ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. దిగువ ప్రాంతాలుగా ఉన్న ఈ కాలనీలకు ప్రధాన రోడ్డు లో ఉన్న మరో కాలువలకు అనుసంధానం చేసే పరిస్థితి లేదని తెలిపారు. మురుకలువల లెవెల్స్ సరిపోక ఇళ్ల ముందే మురుగు పారుతోందని తెలిపారు. గత 15 ఏళ్లుగా ఆయా కాలనీల ప్రజలు మురుగు సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్య తీర్చేందుకు జైళ్ల శాఖ అధికారులతో మాట్లాడి వారి స్థలంలో నుంచి కాలువను తీసేందుకు అనుమతులను కూడా తీసుకువచ్చానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. వెంటనే జిహెచ్ఎంసి అధికారులు భూగర్భ మురుగునీటి కాలువ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మురుగు సమస్యను తీర్చాలని జోనల్ కమిషనర్ కు వివరించారు. దీనికి జోనల్ కమిషనర్ స్పందించి వెంటనే మురుగు కాలువ ఏర్పాటుకు అధికారులతో ప్రతిపాదన సిద్ధం చేయించి తన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ అధ్యక్షుడు భూమిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, కాలనీ మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వెలుమ రెడ్డి, అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.