Take a fresh look at your lifestyle.

“సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి”

  • చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. సోమవారం స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్లో చెన్నూరు నియోజవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రాం భూపాల్, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ముందుగా ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిలో మృతి చెందిన మృతులకు రెండు నిమిషాల మౌనం పాటించారు.అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులను,కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడారు.కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని,పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని సూచించారు.ఇటీవల కొంతమంది తమ అవసరాల కోసం మాత్రమే పార్టీలను మారుతూ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి,వోడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్,పలిగిరి కనకరాజు,మొట్టే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.