పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
ఇబ్బందులు ఉంటుే సమాచారం ఇవ్వాలన్న తెలంగాణ భవన్ అధికారులు
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని సూచించారు. దీనికి సంబంధించి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను అధికారులు వెల్లడించారు. 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
వందన బరువా : +91 9871999044
సీహెచ్. చక్రవర్తి : +91 9958322143
జావేద్ హుస్సేన్ : 9910014749
రక్షిత్ నాయక్ : +91 9643723157