Take a fresh look at your lifestyle.

బసవేశ్వరుడికి కలెక్టర్ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
బసవేశ్వరుడి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
బసవేశ్వర 893వ జయంతోత్సవం నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా అధ్యక్షుడు లింగన్నగారి మల్లప్ప, గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం, జనరల్ సెక్రెటరీ వీరేశం, కోశాధికారి ప్రభు కుమార్, శెట్టి శ్రీకాంతప్ప, సందీప్ కుమార్, కౌన్సిలర్లు లలిత విశ్వం, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.