Take a fresh look at your lifestyle.

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ‌మెదక్ ‌పట్టణంలోని దాయర ‌ పురాతన కట్టడాలైన బావి, దేవాలయాలు ‌ సందర్శించారు. అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు యువత, ఇతర ప్రజాప్రతినిధులున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ‌99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాల పురాతన దేవాలయాలు, కట్టడాలు సందర్శిస్తున్నామన్నారు.
స్వామి బావిని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తుది మెరుగులతో భావిని పునరుద్ధరించి భావితరాలకు ఈ భావియొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా
తీర్చిదిద్దుతామన్నారు. మెదక్ జిల్లాలోని ‌ పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి ‌ పర్యాటక ప్రాంతాలను తుది ‌ రూపు తీసుకువచ్చే విధంగా పర్యాటక, పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో మౌలిక వసతులు కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.