Take a fresh look at your lifestyle.

ఆర్ ఎఫ్ సి ఎల్ గౌరవ అధ్యక్షులు గా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, అధ్యక్షునిగా నేలకంటి రాము.

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: ఆర్ ఎఫ్ సి ఎల్ లో పనిచేస్తున్న మరో 250 మంది కాంటాక్ట్ కార్మికులు బుధవారం గోదావరిఖని దుర్గా నగర్ లోని లక్ష్మీప్రసన్న గార్డెన్ లో సమావేశం నిర్వహించారు.రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) కాంట్రాక్టు కార్మిక సంఘం ఏకగ్రీవంగా 250 సంతకాలతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవాధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ నిఎన్నుకోగా అధ్యక్షునిగా నెలికంటి రాముని ఎన్నుకోవడం జరిగింది.మిగతా కమిటీని ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మికుల సెక్షన్ వైజ్ గా,గ్రామాల, కార్పొరేషన్ సంబంధించి తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు పూర్తి కమిటీని ఎమ్మెల్యే సమక్షం లో నియమించడం జరుగుతుందని అధ్యక్షుడిగా ఎన్నికైన నేలకంటి రాము తెలిపారు.సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులు నాయకులుఎల్కలపల్లి మాజీ సర్పంచ్ చిట్టి పోయిన రాజ్ కుమార్,మాజీ కార్పొరేటర్ కందుల సతీష్,బూర్ల.శ్రీను, కన్నూరి శంకర్,ధబేటా మల్లేష్, ఎరుకల అంజి,రమేష్ రెడ్డి,ధాతు శ్రీను,దూస,రాజేష్,జనగామ శ్రీనాధ్,డి.సందీప్,పన్నాల శ్రీను, మట్టపల్లి సంజీవ్,పంబాల తరుగ గర్రెపల్లి శ్యామ్ గౌడ్,సొల్లుకుమార స్వామి,పిట్టల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.