Take a fresh look at your lifestyle.

జీహెచ్ఎంసీ కమిషనర్‌కు పురస్కారం

జీహెచ్ఎంసీ కమిషనర్‌కు పురస్కారం
గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను విజయవంతం చేసినందుకు గుర్తింపు

ముద్ర, హైదరాబాద్ :

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను విజయవంతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ , హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేశారు. రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో డ్రోన్ సర్వైలెన్స్ సాంకేతికతను వినూత్నంగా వినియోగించిన కర్ణన్ తీరును గవర్నర్ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో, భద్రతను మరింత పటిష్టం చేయడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కర్ణన్ నాయకత్వంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలను గవర్నర్ అభినందించారు. ఫలితంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా, భద్రంగా, సమర్థవంతంగా నిర్వహించగలిగారని పేర్కొన్నారు. ఆర్ వి కర్ణన్ నేతృత్వంలో జిల్లా ఎన్నికల బృందం చూపిన అద్భుత సమన్వయం, అంకితభావం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంతో పాటు ఓటర్ల విశ్వాసాన్ని పెంపొందించిందని గవర్నర్ కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.