Take a fresh look at your lifestyle.

పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఐదుగురు విద్యార్ధులు
పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏడ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఐదుగురూ ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి ద్వారా సరఫరా జరుగుతోంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పంజాగుట్ట ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కాలేజీ విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు, డ్రగ్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Leave A Reply

Your email address will not be published.