Take a fresh look at your lifestyle.

అందరి భాగస్వామ్యం తోనే డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాల పూర్తిస్థాయిలో నిర్మూలన

  • జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
  • జిల్లా కేంద్రం లో మాదకద్రవ్యాల నిర్ములన అవగాహన ర్యాలీ.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అందరి భాగస్వామ్యం తోనే డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాల పూర్తిస్థాయిలో నిర్మూలన సాధ్యం అవుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత జెండ ఊపి ప్రారంబించారు. ర్యాలీ మున్సిపల్ పార్క్ నుండి మినీ స్టడియం వరకు సాగగా మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసి, యాంటి డ్రగ్స్ సోల్జర్ గా సైన్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలావరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవే అని మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని అన్నారు. యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంట్టుందని చెడు అలవాట్లను దూరంగా ఉంటె ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ కళాబృందం జిల్లా లో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని వివిధ శాఖల అధికారులతో కలిసికట్టుగా పని చేసి డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.