ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉన్నా అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది.

జిల్లా లో 46 వేల ఎకరాల్లో,నియోజకవర్గం 14 వేల ఎకరాల్లో మొక్క జొన్న పంట సాగు చేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరగానే సానుకూలంగా స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు చేయటం జరిగింది.
కేంద్రం మద్దతు ధర రూ.2400 గా పెట్టినా కేంద్రం మక్కలు కొనుగోలు చేయటం లేదు. మొక్కజొన్న పంట కేంద్రం కొనుగోలు చేసి మద్దతు ధర అందజేయాలన్నారు. తెలంగాణ మార్క్ ఫెడ్ 10 వేల కోట్ల నష్టాల్లో ఉందని, రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. రైతులు ఒకే రకమైన వరి లాంటి పంట కాకుండా ఇతర పంటల సాగుపై మొగ్గు చూపాలని, ఆయిల్ ఫామ్ పంట సాగు తో లాభదాయకమని, టన్ను కి రూ.23 వేలతో రైతుకు లాభం కలుగుతుందని అన్నారు.
అంతర్ పంటగా కోకో పిట్ కూడా వేసుకోవచ్చని, ఫామ్ ఆయిల్ పంట సాగు తో ఫామ్ ఆయిల్ ధర నేడు బంగారంలా ఉందని, ఆ వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ AMC ఛైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ AD ప్రకాష్, DAO భాస్కర్, మార్క్ ఫెడ్ DM హబిబ్, ఎమ్మెర్వో రామ్మోహన్, AMC వైస్ చైర్మన్ సయ్యద్ అఖిల్, చిక్కులభూమయ్య , మహేశ్వర్ రావు, బాలే శంకర్, సురేందర్ నాయక్, AMC డైరెక్టర్ లు, కౌన్సిలర్ లు, సర్పంచులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.