- సూర్యాపేట జిల్లాను అభివృద్ధిలో అగ్రహారంలో నిలిపిన జగదీశ్ రెడ్డి పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- వచ్చి ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా గెలవదు.
- గోదావరి జిల్లాలు రాక పంటలు లేక విలవిలలాడుతున్న తుంగతుర్తి ప్రాంత రైతులు.
- కెసిఆర్ పాలనలోనే తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు ప్రవహించిన గోదావరి జలాలు రైతులకు అందిన వ్యవసాయ విద్యుత్తు.
- ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన బహిరంగ సభలో మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ ,తుంగతుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు అన్నారు. మంగళవారం తిరుమలగిరిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడచిన పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా గోదావరి జల్లాల నిండుగా పారి సస్యశ్యామలంగా ఉండేదని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చాక గడచిన 20 నెలల్లో తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుందని యుగంధర్ రావు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న ప్రజానీకం నియోజకవర్గానికి ఏమైనా నిధులు కేటాయిస్తారేమోనని ఆశగా ఎదురు చూశారని ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మంజూరు చేయకపోగా అభివృద్ధి చేసిన నాయకులను విమర్శించడాని ప్రజలు జీర్ణించుకోలేదని అన్నారు. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దేనని సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మూడోసారి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని విమర్శించడం ముఖ్యమంత్రికి ఎంత మాత్రం తగదని అన్నారు .రాష్ట్రంలో ఇటు సూర్యాపేట జిల్లాలో ఉచిత విద్యుత్తు రైతులకు అందించడమే కాకుండా సాగునీరు తాగునీరు చాలినంత తీసుకువచ్చినందుకు రేవంత్ రెడ్డిని కలుపు మొక్క అని ముఖ్యమంత్రి విమర్శించాడా? అని అన్నారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవదని యుగంధర్ రావు అన్నారు రైతులను నమ్మించి ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని అలాగే 420 హామీలను ఇచ్చి అన్నింటిని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి నేడు జగదీశ్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలడం ఏమిటని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని యుగంధర్ రావు హెచ్చరించారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలోని మళ్లీ తుంగతుర్తి ప్రాంతానికి మళ్ళి గోదావరి జల్లాలు గలగల పారుతాయని రైతుల కష్టాలు నెరవేరుతాయి అని యుగంధర్ రావు అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఆయిల్ పేడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎస్ ఏ రజాక్ తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్యలతో పాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.