Take a fresh look at your lifestyle.

నిరుపేదలకు ఆపన్న హస్తం

ముద్ర, తొగుట: ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తోగుట మండలం కేంద్ర పరిధిలోని PR గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 4,17,500/- (నాలుగు లక్షల పదిహెడు వేల ఐదు వందల రూపాయల) విలువ గల చెక్కులను 11 మంది లబ్ధిదారులకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, పాగాల కొండల్ రెడ్డి,Pacs డైరెక్టర్ నారాయణరెడ్డి, కొంగరి నర్సింలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూస నిరంజన్ రెడ్డి, ఎన్నం భూపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, సిద్ది శ్రీనకర్ రెడ్డి, తప్పెట సుధాకర్, రేపాక తిరుపతి, బర్రెంకల స్వామి, జీడిపల్లి స్వామి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.