- డిఇఓ రమేష్ కుమార్.
ముద్ర విలేఖరి, కల్వకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డిఈఓ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి , వెల్దండ మండలాల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులను ఉన్నత లక్ష్యంతో తీర్చిదిద్దే బాధ్యత కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు.ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు.ఈనెల 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, ఏకరూప దుస్తులు అందజేయాలని తెలిపారు.ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ బోధనను క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి, ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన తీరును క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ నమోదును పెంచాలని అన్నారు.అనంతరం బడిబాట ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ బరపటి వెంకటయ్య, టెస్ట్ బుక్ మేనేజర్ మన పాడు నరసింహులు, యంఈఓలు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, చంద్రుడు నాయక్ , ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.