కోరుట్ల, ముద్ర విలేకరి: పట్టణంలోని భీముని దుబ్బ సాయి జీనియస్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆషాడ మాసంలో జరుపుకొనే బోనాల ఉత్సవ వేడుకలను పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. పాఠశాలలో బోనాలను అలంకరించి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి, అందర్నీ చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చౌకి రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు, అంతరించిపోతున్న మన సంస్కృత, సంప్రదాయాలను మరవకూడదని వాటిని కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నదని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.