Take a fresh look at your lifestyle.

పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాల పురోగతిని సమీక్షించుటకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పిల్లలమర్రి కొనుగోలు కేంద్రం పి పి సి సెంటర్ ను సందర్శించి, అక్కడ రైతులు మరియు పిపిసి సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియ, మౌలిక వసతులు, ధాన్యం నిల్వ మరియు నిర్వహణ అంశాలను పరిశీలించి తగు సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే నరసింహ, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ కొండలరావు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం శ్రీధర్ రెడ్డి, డి సి ఓ ప్రవీణ్, డిఎంఓ నాగేశ్వర శర్మ, తహసిల్దార్ కృష్ణయ్య, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.