ముద్ర ప్రతినిధి, మెదక్:
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఫూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగా కిషన్, టిఎన్జిఓ అధ్యక్షులు దొంత నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, వివిధ బీసీ సంఘాల ప్రకతినిధులు మేకల జయరాములు, ఉప్పల స్వామి, మాసాయిపేట మల్లేశం, బి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తమ ఆటపాటలతో ఉత్తేజపరిచారు.
మున్సిపల్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా ఫూలే మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు అభివర్ణించారు.
మున్సిపల్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ పూలమాలలువేసి నివాళులు అర్పించారు. వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎం. గంగాధర్, కౌన్సిలర్లు హరిత, అరుణ, శివరామకృష్ణ, సంపత్, నర్సింలు, నాయకులు భూపతి రాజ్, సయ్యద్ ఉమర్, వెంకటనారాయణ, సిద్ధిరాములు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ కొనియాడారు. శనివారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతిబా ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి, అకిరెడ్డి.కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కోకన్వీనర్ లు కిష్టా గౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, గౌస్, పార్టీ నాయకులు ప్రభురెడ్డి, సురేందర్ గౌడ్, మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, కిషోర్ కుమార్, చంద్రశేఖర్ గౌడ్, గట్టేష్, ఇస్మాయిల్, సునీల్, సంతోష్, సాయి కుమార్, బాలరాజు, నరేందర్, శంకర్, నవీన్, కనక చారి, కిరణ్, స్వామి నాయక్, మహేష్ తదితరులున్నారు.