Take a fresh look at your lifestyle.

మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు.జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ తో ప్రారంభించిన అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఐఓసిఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) క్రింద అందించిన 10 వార్మర్స్, 2 డబుల్ సర్ఫర్ ఫోటో థెరపీ, ఆటోక్లేవ్, సక్షన్ ఆపరేటస్, బబ్ల్ సి పాప్, వెంటిలేటర్, పొర్టబుల్ ఎక్స్ రే వంటి పరికరాలతో నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేసినందున ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని, రిస్క్ కేసులను,ప్రీ మెచ్యుర్డ్ ప్రసవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రసవాల సంఖ్య నెలకు 200 కు పైగా పెరిగాయని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా అవుట్ పేషెంట్ సంఖ్య 700 కు పెరిగిందని, రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కంటి శస్త్ర చికిత్సలు, దంత శస్త్ర చికిత్సలు, జనరల్ ఫిజియన్, ఆర్థో శస్త్ర చికిత్సలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇన్ పేషెంట్ సేవలు మెరుగ్గా అమలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులో ఉందని, డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డయాలసిస్ కేంద్రం ద్వారా రోజుకు 15 మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులలో తమ డబ్బును వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిని నిత్యం తనిఖీ చేసి వైద్య సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, పిల్లల వైద్య నిపుణులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.