ముద్ర,రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో గురువారం ఐసిడిఎస్ సిడిపిఓ మమత ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో పోషణ్ పక్వాడ్ పై కార్యక్రమం నిర్వహించారు.ఇందులో 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహించగా,120 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు.కంటి శుక్లం, ఉచ్చర్గం లాంటి సమస్యలపై వైద్య సలహాలు ఇవ్వడమేకాక, అవసరమైన పిల్లలను ఉన్నత ఆరోగ్య కేంద్రాలకు పంపించారు.సిడిపిఓ మమత మాట్లాడుతూ,గర్భిణీలు, బాలింతలు,చిన్నారుల రక్తహీనత నివారణ కోసం పోషకాహారం తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలంటూ సూచించారు.సీమంతం, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు, ఆయాలు,తల్లులు, బాలింతలు,పిల్లలు,కిశోర బాలికలు పాల్గొన్నారు.