Take a fresh look at your lifestyle.

చందానగర్ ఈద్ మిలాప్ కార్యక్రమంలో  పాల్గొన్న చైర్మన్

మాదాపూర్, ముద్ర:  చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీయేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా  చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్యాగం, దయ, సాహనుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర  రంజాన్ పర్వదినం  ముగిసిన తర్వాత ఆత్మీయ కలయికనే ఈద్ మిలాప్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని,  తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని ,అన్ని విధాలుగా అండగా ఉంటానని, మైనారిటీ ఫంక్షన్ హాల్ మరియు ఉర్దూ పాఠశాల అభివృద్ధి కి కృషి చేస్తామని  గాంధీ  తెలియచేసారు .ఈ కార్యక్రమంలో జమయిత్ ఉల్ అన్సార్ శేరిలింగంపల్లి ఈద్ మిలాప్ సెలెబ్రేషన్స్ ప్రెసిడెంట్ మసూద్ అలీ మహ్మద్, జనరల్ సెక్రటరీ మహ్మద్ అజిజ్ ఉల్ హాక్,జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అక్రముద్దీన్, మహ్మద్ జాఫర్ అహ్మద్, ట్రెజరర్ మహ్మద్ షబీర్ అహ్మద్ మరియు మహమ్మద్ బేగ్, అక్బర్ ఖాన్, యూసఫ్, అంజాద్ మరియు ముస్లిం సోదరులు తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.