ముద్ర, ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవలయంలో మహిళ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు లక్కుమల్ల కల్పన, ఏబ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుసారి లావణ్య బాల శివుడుగౌడ్ ల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని అధిష్టానాన్ని కోరారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉండి, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితోనే సాధ్యమని, ఆయన పట్ల విశ్వాసంతో నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొర నాగరాణి, భర్త జ్యోతి. మొర పల్లవి, శ్రీలేఖ, పల్లవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.