ముద్ర,తాండూరు ప్రతినిధి:
మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు మహారాణా ప్రతాప్ సింగ్ అని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రోడ్ మార్గంలోని ఖాంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. మహారాణా ప్రతాప్ సింగ్ ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కష్టకాలంలో కూడా ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా పోరాడిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యువకులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీర యోధుడికి స్మరించుకున్నారు.