Take a fresh look at your lifestyle.

అల్లూరి సీతారామ రాజు మహజ్వలశక్తి: అరికపూడి గాంధీ

మాదాపూర్, ముద్ర విలేకరి: భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడని పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ కొనియాడారు. ఈ రోజు ఆ మహనీయుడి128 వ జయంతిని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఉషముళ్లపూడి కమాన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, కార్పొరేటర్ నార్నె శ్రీకాంత్ తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు  అని, మన్యం ప్రజలలో విప్ల బీజాలు  నాటి ప్రజలను  చైతన్య  పరిచి  స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన  మహానుభావుడు అల్లూరి అని చైర్మన్ గాంధీ కొనియాడారు.భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అని, అల్లూరి సీతారామ‌రాజు 22 ఏళ్ల చిన్న వ‌య‌సుల్లోనే మ‌న్యం ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుని బ్రిటీషు పాల‌న‌ను ఎదిరించిన గొప్ప యోధుడ‌ని, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి బ్రిటిష్ పాల‌న నుంచి విముక్తి ల‌బిస్తుందని న‌మ్మి తెల్ల‌దొర‌ల పైకి విల్లు ఎక్కుపెట్టిన ధీరుడు అని అతి చిన్ని వ‌య‌సులోనే బ్రిటిష‌ర్ల‌ను కంటిమీద కునుకు లేకుండా చేసి గ‌డ‌గ‌డ‌లాడించిన అల్లూరిని తుపాకుల‌తో కాల్చి చంపుతున్న వందేమాత‌రం అని నినదించిన గొప్ప మ‌హానీయుడు అని, అయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం అని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, ఆయన అడుగు జాడలో యువత నడవాలని చైర్మన్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.