Take a fresh look at your lifestyle.

చెంచుల నిమిత్తం బహుళార్థక సాధక కేంద్ర భవనం నిర్మాణం

  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, ముద్ర ప్రతినిధి : చెంచు కాలనీ వాసుల నిమిత్తం బహుళార్థక సాధక కేంద్ర భవనం నిర్మాణం చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి చెంచు కాలనీలో ప్రధానమంత్రి జన్మాన్ పథకం కింద నిర్మించే బహుళార్థక సాధక కేంద్రం (మల్టీ పర్పస్ సెంటర్) భవన నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. చెంచు కాలనీ వాసుల వివిధ అవసరాల నిమిత్తం రూ 60 లక్షల వ్యయంతో బహుళార్థక సాధక కేంద్రం భవనాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణంతో చెంచు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భవన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, ఆర్డీవో వాసు చంద్ర, తహసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.