Take a fresh look at your lifestyle.

మసీద్ బండ కుడికుంట చెరువు కట్టపై మొక్కలు నాటిన గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో గల కుడికుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులలో భాగంగా చెరువు కట్ట పై మొక్కలు నాటిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరికరణ తో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదా మని, చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని,చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి, జీవ వైవిధ్యం పెరుగుతుంది,పక్షలు వలసలు మొదలు అవుతాయి అని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే వారు కనబడే దేవుళ్ళతో సమానమని చైర్మన్ గాంధీ తెలియచేశారు.
సెహ ఎంజీవో అద్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ కృషి తో కుడి కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయంగా పని చేసి నేడు చెరువును పునరుద్ధరణ చేసిన శుభసందర్భంగా ఈ రోజు చెరువు కట్ట పై మొక్కలు నాటడం జరిగినది అని, చాలా సంతోషకరమైన విషయం అని పర్యావరణం పరిరక్షణ కై ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైర్మన్ గాంధీ అన్నారు .చెరువు చుట్టూ పరిసర ప్రాంతాలు హరిత వైభవోత్సవం గా విరాజిల్లునని, చెరువు చుట్టూ పక్కల కాలనీలు పచ్చని మణిహారం గా మారునుందని, కాలనీ లో ప్రధాన రహదారికిరువైపుల మరియు అంతర్గత రోడ్లలో మొక్కలు నాటడం జరిగినది అని, కాలనీ లో ప్రతి ఒక్కరు బాగసామ్యం అయి మొక్కలు పెట్టి వాటిని పెంచి పెద్ద చేసే బాధ్యత తోసుకోవడం అభినందనియం అని, మొక్కలు నాటడం ద్వారా అపార్ట్మెంట్ వాసులు, చుట్టపక్కల కాలనీ ల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చైర్మన్ గాంధీ తెలియచేశారు.ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటుతామని, ఔషద గుణాలు గల మొక్కలు, పండ్ల జాతుల మొక్కలు నాటి ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటి సంరక్షిస్తామని,లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి-వాటిని కాపాడాలిఅని, మానవాళి మనుగడకు మొక్కే శ్రీరామ రక్ష అని, సమస్త జీవ కోటికి ప్రాణధారం మొక్కలు అని ,కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరం గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసునని కావున దీనిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైర్మన్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా ఖాళీ స్థలాలు,రోడ్లకు ఇరువైపులా, అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి అని ,నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని, మొక్కలు నాటాడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.