- తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ యువకులకు నిరుద్యోగులకు అండగా ఉంటుందని యువకులు మత్తు పదార్థాలకు,డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ అన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ సెక్రటరీ బోగోజీ ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ సొసైటీ పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అయి మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదువుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధులై ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారని,10 సంవత్సరాలలో బిఆర్ఎస్ పాలనలో యువకుల జీవితాలు ఆగమయ్యాయని కాంగ్రెస్ పాలనలో డీఎస్సీ నిర్వహించామని 58వేలకు పైగా ఉద్యోగాలు నియామక పత్రాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. యువకులు ఉన్నత విద్యను అభ్యసించి పోటీ పరీక్షలకు సన్నద్ధులై ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపడతామని డ్రగ్ ఫ్రీ సొసైటీ పేరిట కార్యక్రమాలు చేపడుతున్న సేవాదళ్ కాంగ్రెస్ కార్యదర్శి ముఖేష్ కన్నాను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు బండి సురేందర్ దయాకర్, రాజేష్, ఫయాజ్, ఫశీ, షమీ, వసంత తదితరులు పాల్గొన్నారు.
