Take a fresh look at your lifestyle.

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర:

ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట క్షేత్రాలను సందర్శించి బాధిత రైతు కుటుంబాలతో మాట్లాడారు.
పంట నష్టపోయిన రైతులు ఎంపీ దగ్గర తమ గోడును వెలిబుచ్చారు. చేతికొచ్చిన పంట కళ్ళముందే కాలి బూడిద అయ్యిందని పంట కోసం చేసిన అప్పులు మాత్రం అలాగే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమని అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబాలు వేడుకున్నారు. రైతుల ఆవేదనను విన్న ఎంపీ వెంటనే ఉన్నత అధికారులకు ఫోన్ చేసి త్వరగా బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. బోథ్ లో అగ్ని మాపక కేంద్రం లేకపోవడం కూడా ప్రమాద తీవ్రతకు కారణం అయ్యిందని, అగ్నిమాపక కేంద్రాన్ని బోథ్ కు తెప్పించాలని రైతులు కోరగా స్పందించిన ఎంపీ అధికారులతో మాట్లాడి బోథ్ కు అగ్నిమాపక కేంద్రాన్ని తెప్పిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరే రవీందర్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మాజీ మెంబర్ జివి. రమణ, బోథ్, బజార్హత్నూర్ సహకార సంఘం చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,
బిజెపి జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.