బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంకు రోడ్లను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోనీ ప్రధాన రోడ్లను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రంను అందజేశారు. బోథ్ పట్టణంలో బీటీ రోడ్డు, సీసీ రింగ్ రోడ్డు, లైటింగ్ నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పోచ్ఛర ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ టౌన్ వరకు ఫోర్ లైన్ తో పాటు సెంట్రల్ లైటింగ్, మైనర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 38 కోట్లు,
ఇచ్చొడ మండల కేంద్రంలో ఫోర్ లైన్ నిర్మాణంలో భాగంగా సైడ్ డ్రైన్ నిర్మాణానికి రూ. 2 కోట్లు,
మంజూరు చేయాలని కోరారు ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఈ అండ్ సి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.