Take a fresh look at your lifestyle.

పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను త్వరగా పూర్తి చేయాలి -చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పనులను సత్వరమే చేపట్టాలని కోరుతూ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలోని రైలు భవన్ లో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ కుమార్ జైన్ ను కోరారు. ఈ సందర్బంగా డిల్లీ లోని రైల్వే కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం శంకరపల్లి ప్రాంతానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి కూడా ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్టు వివరించారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రైల్వే సమస్యలను వీలయినంత త్వరగా పరీక్షకరించి ప్రజలకు రైల్వే సౌకర్యలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా నవాంద్గి రైల్వేస్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నిలపడానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూల ప్రతిపాదన పంపడం జరిగిందని, దానికి అనుగుణంగా రైల్వే బోర్డు ద్వారా తక్షణం హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు సమీపంలో, ఇంద్రానగర్ ప్రాంతాలలో రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద డిపిఆర్ లు పూర్తయిన దృష్ట్యా ఆర్ఓబి, ఆర్ యు బి ల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొండకల్, ముబారక్ పూర్, మర్పల్లి, పాత శంకర్పల్లి, మొరంగపల్లి, గేట్ వనంపల్లి, గొల్లగూడ, నవంద్గి, సిద్ధాంతి, శాతం రాయి, ఫతేపూర్ (ఎల్.హెచ్.ఎస్) ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరగా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు.
-నావంద్గి లో హాగ్లి ఎక్స్ ప్రెస్ రైలు ఆపాలి
తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం బషీరాబాద్ మండలం నవాంద్గీ రైల్వే స్టేషన్లో ట్రైన్ నెం .17319/20 హుబ్లీ- హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని కోరుతూ ఢిల్లీలోని రైల్వే భవన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ కుమార్ జైన్ ని కలిసి కోరగా వారు సానుకూలంగా స్పందించారని, అతి త్వరలో రైలు ఆగుతుంది అని ఆశిస్తున్నానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.