Take a fresh look at your lifestyle.

కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : నవంబర్ 7 న హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే తన కుమారుడు శ్రీరాం రెడ్డి వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.