Take a fresh look at your lifestyle.

సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.శుక్రవారం కల్వకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మందికి రూ,19.50 లక్షల ఎల్ఓసి చెక్కులను అందజేసి మాట్లాడారు. అనారోగ్య బారిన పడి ఆర్థిక ఇబ్బందులు వస్తుండడంతో ప్రభుత్వం సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ కుమార్, అశోక్ రెడ్డి ,భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.