Take a fresh look at your lifestyle.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి పౌరుడిపై ఉంది

  • కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు.

కోరుట్ల, ముద్ర: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కోరుట్ల మండలం సంగెం, నాగులపేట గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, అసెంబ్లీ ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ కత్తి వెంకట స్వామి పాల్గొన్నారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, అహింస మార్గాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన అవసరం వున్నదని అన్నారు.పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు.అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాని మంత్రి వర్గం నుండి తొలగించాలని అన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేలా చూస్తుందని అన్నారు.రాజ్యాంగాన్ని రక్షించు కోవాల్సిన భాద్యత ప్రతి ఒక పౌరుడిపైన వున్నదని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు వర్గాలకు సామజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ సేవాధల్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో, కోరుట్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.