ముద్ర ప్రతినిధి, మెదక్:
స్వాతంత్ర్య ఉద్యమ అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుకదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రిటైర్డ్ టీచర్ కొండల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి ఏ..మల్లేశం, కోశాధికారి కే.నరసమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే.మల్లేశం, వివిధ సంఘాల నాయకులు గౌరయ్య, సంతోష్, గణేశ్వరెడ్డి, నరేందర్, కవిత, వెంకట్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
