Take a fresh look at your lifestyle.

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పి ఆర్ టి యు టి ఎస్  జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల్ అర్బన్ మండలంలోని కేజీబీవీ ధరూర్ క్యాంప్ వీక్లీ బజార్ పురని పేట్ మోతే గోపాలరావుపేట్ కొత్తవాడ కజీపూర్ పాఠశాలలో పి ఆర్ టి యు టి ఎస్ సభ్యత నమోదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీబీవీలో ఉపాధ్యాయులు ప్రధానంగా ఎదుర్కొంటున్న మినిమం టైమ్ స్కేల్ ,కేర్ టేకర్  నియామకాలు ,సమ్మె కాలానికి వేతనం, వ్యాయామ ఉపాధ్యాయులకు సి ఆర్ టి లతో సమానంగా వేతనాలు  ఆర్థికేతర అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి ఇప్పటికే ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో కేజీబీవీ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న కొన్నిసమస్యలను పి ఆర్ టి యు టి ఎస్ ద్వారానే సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విద్యా దేవి, పద్మ, మహిళ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షరాలు శశికళ, ఉపాధ్యక్షురాలు చందన, రాష్ట్ర కార్యదర్శులు ప్రభాకర్, అనుజ, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, సుజాత, ప్రవీణ్, షఫీ, రమేష్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.