Take a fresh look at your lifestyle.

వైభవంగా స్వర్ణ గిరీష్యుడి నిత్య కళ్యాణం.. తిరువీధి ఉత్సవం.

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో
శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించి సహస్ర నామార్చన సేవ శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధిఉత్సవసేవను ఘనంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.