Take a fresh look at your lifestyle.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం-మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు, తాటికొండ సీతయ్య

 

ముద్ర ….తుంగతుర్తి ….
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులు కేటాయించడంలో పూర్తిగా పక్షపాత వైఖరి అవలంబించిందని మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు, సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం మిగతా రాష్ట్రాలకు వేరొక న్యాయం పాటించి పక్షపాత వైఖరి అవలంబించింది అన్నారు, రాష్ట్రానికి కావాల్సిన రావాల్సిన వ్యవసాయరoగానికి రైల్వే. విమానయానా, రంగాలకు నిధులు కేటాయించ లేదన్నారు, ఉపాధి కల్పనా రంగం లో కూడా సరియైన నిధులు కేటాయించడం లో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు, రాష్ట్రం నుండి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు , రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు,. రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులు రాబట్టడం లో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు రాష్ట్ర ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు తిరిగి రాష్ట్రం లో కెసిఆర్ ప్రభుత్వం తెచ్చే విధంగా ప్రజలు సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశం లో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు తునికి సాయిలు గౌడ్. గోపగాని రమేష్ గౌడ్. చింతకుంట్ల భాస్కర్ గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.