చిత్తశుద్ధి ఉంటే కుల వ్యవస్ధను రద్దు చేయండి- పార్లమెంట్, న్యాయవ్యవస్థ, రాష్ట్రపతికి మందకృష్ణ డిమాండ్
మతం మారితే ఎస్సీ హోదా రద్దు ఆదేశాలు తగవు
ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
పార్లమెంట్, న్యాయవ్యవస్థ, రాష్ట్రపతికి చిత్తశుద్ధి ఉంటే దేశంలో కుల వ్యవస్థ రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మందకృష్ణ స్పందించారు. దళితులు క్రిస్టియన్‍గా మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుంతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం కాదు దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అయితే ఈ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని ఇవి వివక్షతో కూడిన ఉత్తర్వులు అన్నారు. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యల కోసం ముందుకు ఏ పార్టీ, ఏ సంస్థ తీసుకున్నా దానిని స్వాగతిస్తామని, వారికి అండగా నిలబడతామన్నారు. ఈ కుల వ్యవవస్థలో అత్యంత బాధితులు దళితులేనన్న మందకృష్ణ…పశువులకంటే హీనంగా చూడబడ్డది దళితులేనన్నారు. ఈ దేశ కులవ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్ని బాధితులేనన్నారు. కుల వ్యవస్థలో ఏ రెండు కులాల మధ్య సాఘీక సామరస్యత లేదనీ కానీ అన్నీ కులాల మీద ఆధిపత్యం, గౌరవం పొందుతున్నది మాత్రం బ్రాహ్మణ వ్యవస్థ అన్నారు. తాము కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల వ్యవస్థను ఏ రాజకీయ పార్టీ సమర్ధిస్తదో బహిరంగ పరచాలన్నారు. అసృశ్యత ఏ వ్యవస్థ నుంచి రాజకీయ పార్టీలు బహిరంగ పరచాలన్నారు. సమానత్వాన్ని కోరుకునే కుల వ్యవస్థ రద్దు చేయాలని కోరుకుంటారు. సమాజంలో అసమానతలను కోరుకునే వారు కుల వ్యవస్థను కోరుకుంటారు. అందువల్ల కుల వ్యవస్థ ఉండాలనుకునే వారెవరో, కుల వ్యవస్థ రద్దు కోరుకునే వారెవరో బహిరంగంగా రావాలని డిమాండ్ చేశారు.