Take a fresh look at your lifestyle.

ఐదో అంతస్తుపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య

ముద్ర కూకట్‌పల్లి :
మద్యానికి బానిసై ఓ వ్యక్తి భవనంపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సలాని భీమారావు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు.
ఇటీవల రమణ బావమరిది మృతి చెందడంతో, ఆ బాధలో అతను విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గం. 1:00 సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయము లో, తాను నివాసముంటున్న భవనం ఐదో అంతస్తు పై నుండి కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.