Take a fresh look at your lifestyle.

రజక సంఘం ఆధ్వర్యంలో బోనాలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : రజకుల కులదైవం మడెలయ్యకు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం బోనాలు సమర్పించారు. స్థానిక రజక సంఘం కార్యాలయం నుంచి మొదలైన బోనాల శోభాయాత్ర రాజీవ్ చౌక్,బీజోన్ సెంటర్ మీదుగా అమరవాది చెరువు సమీపంలోని మడెలయ్య గుడికి చేరుకున్నారు. అనంతరం బోనాల కుండలలో తీసుకువచ్చిన (బెల్లం అన్నం) నైవేద్యంగా సమర్పించారు. సుమారు 120 బోనాలను మడెలయ్యకు సమర్పించినట్లు రజక సంఘం పట్టణ అధ్యక్షుడు తిరుపతి తెలిపారు.బోనాల జాతరను విజయవంతం చేసిన రజక కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.