- ఆశీర్వదించిన పోచారం
- వేడుకలు జరుపుకున్న నేతలు, అభిమానులు
బాన్సువాడ, ముద్ర: ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, సమస్యలపై వెంటనే స్పందించే పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం ఆయన తండ్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆశీర్వదం తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పోచారం ఇంటికి విచ్చేసి భాస్కర్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు.ఆలాగే నాయకులు మహమ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, హకీమ్, గోపాల్ రెడ్డి, షేక్ అజీమ్, షాహాబ్, వహాబ్, తయ్యబ్ తదితరులు భాస్కర్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇబ్రహీం పేట గ్రామంలో మాజీ సర్పంచి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గంలోని బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, కోటగిరి తదితరుల మండలాల్లోనూ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- యువ నేత కు పెరుగుతున్న అభిమానులు
బాన్సువాడ నియోజకవర్గ ప్రజల గుండెల్లో మంచి పేరు సంపాదించుకున్న యువ నాయకుడు, ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడుగా వారి పేరును శిరస్థాయిగా నిలబెట్టే నాయకునిగా, పేద ప్రజలకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చే నాయకునిగా ఎదుగుతున్నారు. గతంలో ఆయన నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో నేనున్నాను అని రెండు సార్లు విద్యార్థులకు ట్రైనింగ్ క్యాంపులు పెట్టిచ్చి ఎంతోమందికి ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇప్పించారు. అన్ని మతాల వారికి ఎటువంటి భేదం లేకుండా ఇటు పూజలలో గాని అటు మస్జిద్లలో గాని అటు చర్చిలలో గాని ఎవరికి ఏది కావాలన్నా తక్షణమే సహాయం చేసే మంచి మనసత్వం ఉన్న నాయకునిగా పేరు సంపాదించుకున్నారు. ఎవరికైనా ఆపద వచ్చి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సహాయం చేసి వారికి అండన నిలబడే నాయకునిగా బాన్సువాడ నియోజకవర్గంలో పేరు పొందారు. ప్రజలను తన కడుపులో పెట్టుకొని కాపాడే ధైర్యం సత్తా ఉన్న నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి అని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
