ముద్ర ప్రతినిధి, జడ్చర్ల: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. బుధవారంజడ్చర్ల పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వీర శివాజీ నగర్, పాత బజార్ కాలనీలో ఏర్పాటుచేసిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆది మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి, 16వ వార్డు బారాస ఇన్చార్జ్ రాజేష్, మన్యం రెడ్డి, నర్సింగ్, రాజు, గౌడ్ వీరేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.