Take a fresh look at your lifestyle.

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు

మెట్ పల్లి, ముద్ర: శనివారం రోజు పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు కాంగ్రెస్ నాయకులు అర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు.ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.