Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని , వాటిలో ఎన్ని ఇండ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మిగిలినవి ఏ.ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ను లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇప్పించి ఇండ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణం అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయా అని ఆరా తీశారు. వివిధ దశలో మిగిలి ఉన్న నిర్మాణ పనులను కూడా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా వస్తుందని త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.