బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతారా-రెండు పార్టీలు కావాలని దాడి చేసుకుని నాటకాలు -సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
బీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీల వైఖరి నువ్వు కొట్టినట్టు చేయ్ నేను అరచినట్టు చేస్తా అన్న చందంగా ఉందని రెండు పార్టీల నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని దాడులు చేసుకుని అందులో ఒక పార్టీ బందుకు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు.పరస్పరం రెండు పార్టీలు అవసరాన్ని బట్టి సహకరించుకుంటూ మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.ఈ డ్రామాను రంజింపచేయడానికి బిఆర్ఎస్ పార్టీ బందు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని నరేందర్ రెడ్డి ఆరోపించారు.ఇప్పటికైనా పునరాలోచించి బందు కార్యక్రమాన్ని విరమించుకోవాలని నరేందర్ రెడ్డి సూచించారు.