ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య దేవస్థానంలోశుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.